calender_icon.png 1 May, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణచివేత ధోరణులు వద్దు

01-05-2025 12:00:00 AM

ఐ. ప్రసాదరావు :

నేడు ప్రపంచానికి ఉగ్రవాదం పెను ప్రమాదంగా పరిణమించింది. పలు దేశాల్లో ఉన్న అసమానతలు, అణచివేతలు, వివక్షలు, రాజకీయ, ఆర్థిక, సామా జిక పరిస్థితులతోపాటు ముఖ్యంగా జాతి, మత ఘర్షణలు, వేర్పాటువాదం, సంకుచిత ధోరణులు, దోపిడి వంటి కారణాలవల్ల మర్రిచెట్టు ఊడలవలె ఉగ్రవాదం వివిధ దేశాల్లోకి విస్తరించి ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతున్నది.

గత వారం కశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో సుమారు 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద అంశాన్ని ఈ ఘటన యావత్ ప్రపంచం సీరియస్‌గా ఆలోచించేలా చేసింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కొన్ని దశాబ్దా లుగా భారత్‌పై అనేకసార్లు దాడు లు చేశా రు. దేశ ప్రజాస్వామ్యానికి నిలయంగా భా వించే పార్లమెంటుపై కూడా ఉగ్రవాదులు దాడులు చేశారు.

ఈ క్రమం లో ఉగ్రవాదులకు అసలు ఆర్థిక వనరులు ఎలా సమకూ రుతున్నాయనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అయితే, డ్రగ్స్ వ్యాపారం ద్వారా ఉగ్రసంస్థలు ఆర్థిక వనరులను సమకూర్చుకుంటున్నట్టు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తున్నది. ఇదే సమయంలో పక్క దేశాలపై అక్కసుతో కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిసున్నాయి. 

ఉగ్రవాదానికి ప్రధాన కారణాలు..

ముఖ్యంగా మన దేశంలో ఉగ్రదాడు లు జరగడానికి ప్రధాన కారణం సరిహద్దు దేశం పాకిస్థాన్. దీని ప్రోద్బలంతోనే జ మ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం తరచూ బుసలు కొడుతూ అనేకమంది అమాయక ప్రజ లు, సైనికుల ప్రాణాలను బలితీసుకుంటున్నది. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణి పూర్, త్రిపుర, మేఘాలయ, మిజోరాం వంటి రాష్ట్రాలకు మయన్మార్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ వంటి దేశాల ద్వారా మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా జరుగుతున్నాయి.

ఈ డ్రగ్స్ అక్రమ రవాణావల్ల వారికి ఆర్థిక వనరులు సమకూరి, ఉగ్రవాదం మరింత బలపడుతున్నది. కాశ్మీర్ యువకుల్లో చాలామంది మత్తు పదార్థాలకు బానిసలైనట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తున్నది. డ్రగ్స్‌కు అలవాటు పడిన యువతను ఉగ్రసంస్థలు తమవైపు ఆకర్షిస్తూ తర్ఫీదు ఇవ్వడం ద్వారా దాడులు చేయిస్తున్నాయి.

ఉగ్రవాద సంస్థలు అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు, పేలుడు పదా ర్థాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, యుద్ధ సా మాగ్రి, నిఘా వ్యవస్థలను సమకూర్చుకుం టూ పలు దేశాల ప్రభుత్వాలకు, సైనిక శక్తిని సవాలు చేస్తున్నాయి. కశ్మీర్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో కొందరు స్థానికులు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. 

ముష్కరులకు ఆశ్రయం కల్పించకుం డా ప్రభుత్వం స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాగే, దేశ బడ్జెట్‌లో ఎక్కువ భాగం నిధులు రక్షణ రంగానికే కేటాయిస్తున్నారు. ప్రభుత్వం అదే తరహాలో ఉద్యో గ, ఉపాధి అవకాశాల కల్పన కోసం నిధు లు కేటాయించాలి. తద్వారా యువతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇలాంటి చర్యలవల్ల ఆర్థికంగా బలహీన కుటుంబాలకు చెందిన యువత, నిరుద్యోగులు సమాజానికి హాని కలిగించే శక్తులుగా మారేందుకు అవకాశం ఉండదు.

సరిహద్దు రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ

ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని మన్యం ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ వంటి ప్రాంతాల్లో కొందరు గంజాయి పండిస్తూ దేశ వ్యాప్తం గా పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదే సమయంలో అనేకమంది యువకులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ సమా జంలో అశాంతికి కారణమవుతున్నారు.

మన దేశంలో రకరకాల మత్తు పదార్థాలను అమ్మడం ద్వారా దళారుల జేబుల్లోకి వెళ్తున్న కోట్లాది రూపాయలు అటు తిరిగి ఇటు తిరిగి ఉగ్రవాద సంస్థలకు చేరుతున్నాయి. దేశంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా ద్వారా ఐఎస్‌ఐ వంటి ఉగ్రసంస్థలకు డబ్బులు అందుతున్నట్టు నిఘా సంస్థలు పలుమార్లు వెల్లడించాయి.

ఇప్పటికీ హెచ్చరిస్తున్నాయి. డ్రగ్స్ వ్యాపారం ద్వారా లభించే ఆదాయంతో ఉగ్రవాద గ్రూపులు అనేకమంది యువకులను ఆకర్షించి, వారిని ఉగ్రవాదులుగా మారుస్తూ, మారణహోమం సృష్టించడానికి, ప్రాణ ఆస్తి నష్టాలు కలిగించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు పంపుతున్నాయి.

నిరుద్యోగంతో బాధ పడుతున్న, మత్తుకు బానిసలైన యువతే ఎక్కువగా ఉగ్రవా దం, నార్కోటిక్ టెర్రరిజం వైపు అడుగులు వేస్తున్నారు. అందువల్లే సరిహద్దు రాష్ట్రాల్లోని ఏదో ఒక ప్రాంతంలో ఎక్కువగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. దీనికి తోడు పాలకుల ప్రసంగాలు కొన్ని వర్గా ల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఆయా వర్గాల ప్రజలు అభద్రతా భావం తో ఉగ్రవాదం వైపు వెళ్తున్నారు. అందువల్ల విద్వేష ప్రసంగాలకు పాలకులు ఇకనైనా స్వస్తి పలకాలి. 

చిత్తశుద్ధితో పనిచేయాలి

మన రాజ్యాంగంలో పేర్కొన్నట్టు అందరినీ సమానంగా చూడాలి. పౌరుల ప్రాథ మిక హక్కులకు భంగం వాటిల్లకుండా చూ సుకోవాలి. దీంతోపాటు సరిహద్దు రాష్ట్రా ల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకోవాలి. చెడు దారి పట్టకుండా యువతను ఉపాధి రంగాలవైపు తరలించాలి. గిరిజన ప్రాంతాల్లో అటవీ హక్కుల చట్టాలను సమర్థవంతంగా అమ లు చేసి, వారికి లబ్ధి చేకూరేలా కృషి చేయా లి.

ముఖ్యంగా మన దేశంలోని మైనారిటీ ప్రజల రక్షణకు పాలకులు భరోసా కల్పించాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా గిరిజన, మైనారిటీ ప్రజల రక్షణకు విఘాతం కలిగేలా చట్టాలు చేసి, వారిలో ఆగ్రహావేశాలు రగిలించకూడదు. గిరిజన ప్రాంతాల్లో అట వీ భూమిని, ఖనిజ సంపదను కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టకూడదు. ముఖ్యంగా దేశంలో మావోయిస్టు, ఉగ్రవాదుల ప్రభావాన్ని అరికట్టాలంటే యువత సరైన మార్గంలో పయనించేలా ప్రభుత్వాలు చొరవ చూపాలి.

అందుకోసం నాణ్యమైన విద్యతోపాటు సమాన అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తేవాలి. ఇక్కడ తల్లిదండ్రులు కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పిల్లలకు ఎప్పటికప్పుడు మంచి, చెడు చెబుతూ పెంచాలి. మాదక ద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు సరిహద్దు రాష్ట్రాలపై నిఘా పెట్టాలి. మత్తు పదార్థాలను దేశంలో పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి, కలిసి పని చేయాలి. 

వివక్ష, అణచివేత ధోరణలు శ్రేయస్కరం కాదని ప్రభుత్వాలు గుర్తించాలి. దేశంలో నెలకొన్న అలజడులతోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ప్రధాన కారణాలను ప్రభుత్వాలు అన్వేషించాలి. వాటి నిర్మూలన కోసం దేశంలోని మేధావులతో చర్చలు జరిపి శాశ్వత పరిష్కారం కనుగొనాలి.

నిఘా సంస్థలు మరింత సమర్థవంతంగా పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మన దేశానికి నష్టం కలిగించేలా ప్రవర్తించే దేశాలపై చర్యలు తీసుకునే విధంగా అంతర్జాతీయ సంస్థలపై ఒత్తిడి చేయాలి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది.