calender_icon.png 2 July, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓవర్ టైమ్ వద్దు

02-07-2025 12:43:38 AM

  1. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ మెయిల్స్
  2. తెరపైకి 70 గంటల వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూలై 1: ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు వర్క్ బ్యాలెన్స్‌పై కీలక సూచనలు చేస్తోంది. పని గంటలకు మించి పని చేయొద్దంటూ అదనపు పని గంటలు పనిచేస్తున్న వారికి వ్యక్తిగ తంగా ఈమెయిల్స్ పంపుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. ఇన్ఫోసిస్‌లో దాదా పు 3.23 లక్షల మంది పనిచేస్తున్నారు.

2023, నవంబర్ నుంచి ఈ సంస్థ హైబ్రిడ్ విధానాన్ని అవలంబిస్తోంది. నెలలో కనీసం పది రోజుల పాటు ఆఫీసుకొచ్చి పనిచేయాలని ఉద్యోగులకు సూచించింది. అయితే, ఐటీ ఉద్యోగులు అదనపు పని గంటలు, నిద్రలే మి, టైమ్‌కు తిండి తినకపోవడం వంటి కారణాలతో అనారోగ్యం బారిన పడుతున్నట్టు గుర్తించింది.

ముఖ్యంగా గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రహించిన సంస్థ హెచ్‌ఆర్ విభాగం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ ఉద్యోగులకు సూచనలు చేస్తోంది. భారతీయులు వారంలో 70 గంటల పాటు పనిచేయాలంటూ గతంలో వ్యాఖ్యానించారు. తాజాగా ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల వ్యక్తిగత ఆరో గ్యంపై శ్రద్ధ చూపించడంతో నారాయణ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు వస్తున్నాయి.