02-07-2025 12:40:44 AM
వాషింగ్టన్, జూలై 1: రష్యాతో వాణిజ్య ఒప్పందం కొనసాగిస్తున్న భారత్, చైనాలపై.. అమెరికా 500 శాతం భారీ సుంకం విధించే అవకాశముందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు. ఈ మేరకు యూఎస్ సెనెట్‌లో బిల్లు ప్రతిపాదనన పంపించేందుకు కసరత్తులు జర గుతున్నాయని తెలిపారు. ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిం డ్సే గ్రాహం మాట్లాడుతూ.. ‘రష్యా నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేయడం..
అదే సమయంలో ఉక్రెయిన్‌కు సహాయం అందిం చకపో వడం లాంటివి చేస్తే భారత్, చైనా నుంచి అమెరికాకు దిగుమతులయ్యే వస్తువులపై 500 శాతం సుంకాలు విధించే అవకాశముంది. ముఖ్యంగా భారత్, చైనాలు రష్యా నుంచి 70 శాతానికి పైగా చమురును కొనుగోలు చేస్తున్నాయి.
ఆగస్టులో ఈ బిల్లును ప్రవేశపెట్టే యోచనలో ఉ న్నాం. దీని వల్ల రష్యాను ఆర్థికంగా ఒంటరి చేసామన్న భావన కలుగుతుంది’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా ముడి చమురులను కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు పెద్ద దెబ్బే అని చె ప్పొచ్చు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న ప్రధాన కొనుగోలుదారుగా భారత్ ఉన్న సంగతి తెలిసిందే.