calender_icon.png 28 November, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త పార్టీ ఆలోచనలో మస్క్

02-07-2025 12:48:42 AM

  1. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిలు’్లపై టెస్లా అధినేత ఆగ్రహం
  2. బిల్లు ఆమోదం పొందితే పార్టీ పెడతానంటూ హెచ్చరికలు
  3. ట్రంప్, మస్క్ మధ్య మరింత ముదిరిన వివాదం
  4. అలా చేస్తే మస్క్ దుకాణం సర్దుకోవాల్సిందే: ట్రంప్

న్యూయార్క్, జూలై 1: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై ఎలాన్ మస్క్ మరోసారి మండిపడ్డారు తాజాగా ఆ బిల్లుకు ఆమోదం లభిస్తే మరుసటి రోజే ‘ది అమెరికా పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు మస్క్ పేర్కొన్నారు.

అమెరికాలో ప్రస్తుతం డెమోక్రటిక్ యూనియన్ పార్టీకి ప్రత్యామ్నాయం కావాల్సిన అవసరముంద ని నొక్కి చెప్పారు. ఇది ప్రజల గొంతుకగా ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. ఈ బిల్లు దేశానికి వినాశకరమని, దీనికి మద్దతిచ్చే చట్టసభ సభ్యులను వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరు తానన్నారు. ఈ బిల్లు పిచ్చిదనే విషయం స్పష్టంగా కనిపిస్తుందని, దీని ద్వారా ఆ దేశ అప్పు 5 ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముందని తెలిపారు.

ఇప్పుడు ప్రజల గురించి శ్రద్ధ వహించే కొత్త రాజకీయ పార్టీకి సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చట్టసభ సభ్యులపై కూ డా పలు విమర్శలు చేశారు. ప్రభుత్వ వ్య యాన్ని తగ్గిస్తామని వారు తొలుత ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు రుణభారాన్ని పెంచే బిల్లుపై ఓటు వేస్తే సిగ్గుతో తలదించుకోవా ల్సి వస్తోందని మస్క్ విమర్శించారు. కాగా టెస్లా అధినేత మస్క్ హెచ్చరిలపై వైట్‌హౌస్ నుంచి ఘాటైను ప్రతిస్పందన వచ్చింది.

చరిత్రలో ఎవరూ పొందనంత రాయితీని ఎలా న్ మస్క్ తీసుకున్నారని.. అవే లేకపోయుం టే అతడు దుకాణం మూసుకొని దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సిందేనంటూ ట్రంప్ తన సామా జిక మాధ్యమం ‘ట్రూత్’లో పోస్టు పెట్టారు. అయితే ఇదే ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను వ్యతిరేకిస్తూ మస్క్ గతంలోనే ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ (డోజ్) నుం చి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లు అమెరికాను అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని మస్క్ ఆప్పట్లోనే తెలిపారు. అప్పటినుంచే ట్రంప్, మస్క్ మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. 

అలా చేస్తే మస్క్ దక్షిణాఫ్రికా వెళ్లాల్సిందే: ట్రంప్

మస్క్ ఆరోపణలపై ట్రంప్ స్పందిస్తూ.. ‘కొన్నాళ్ల క్రితం వరకు అధ్యక్షుడిగా నాకు అతడు బలమైన మద్దతు ఇచ్చారు. అప్పటికే నేను విద్యుత్తు వాహనాలను తప్పనిసరి చే యడాన్ని వ్యతిరేకిస్తున్న విషయం మస్క్‌కు బాగా తెలుసు. ఎలక్రిక్ కార్లు మంచివే. కానీ ప్రతి ఒక్కరూ వాటినే కొనాలని బలవంతం చేయలేము. ఇప్పటివరకు మానవ చరిత్రలో ఎవరూ పొందనంత సబ్సిడీని ఎలాన్ అం దుకొన్నారు.

ఆ రాయితీలే లేకపోతే ఆయన దుకాణం సర్దుకొని దక్షిణాఫ్రికాలోని ఇంటికి వెళ్లాల్సి వచ్చేది.  ఇకపై రాకెట్, ఉపగ్రహ ప్రయోగాలు.. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులు ఉండ వు. మన దేశం మరింత సొమ్మును ఆదా చే సుకుంటుంది. ఈ అంశాన్ని డోజ్ పరిశీలించాలి. చాలా పెద్ద మొత్తం ఆదా అవుతుంది.’

అని ట్రూత్‌లో పేర్కొన్నారు. అమెరికా అధ్య క్ష ఎన్నికల వేళ ఎలాన్ మస్క్.. ట్రంప్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తన గెలుపులో మస్క్ కీలకపాత్ర పోషించారని ట్రంప్ స్వయంగా ప్రకటించారు.  వీరిద్ద రూ కలిసి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో గత నాలుగు, ఐదు నెలలు కలిసి పని చేశారు.

ఏమీటి ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పేరిట ఒక ప్యాకేజీని తీసుకొచ్చారు. దీని ద్వారా తన మొదటి పదవీకాలంలో ప్రవేశపెట్టిన పన్ను కోతలను 4.5 ట్రిలియన్ డాలర్ల మేర పొడిగించడం, సైనిక వ్యయాన్ని పెంచడం, దే శచరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వలసదారుల భారీ బహిష్కరణకు నిధులు సమకూర్చడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఈ బిల్లు వల్ల దేశ జాతీయ అప్పు పదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరుగుతుందని, లక్షలాది మంది పేద అమెరికన్లకు ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలలో సుమారు 1 ట్రిలియన్ డాలర్ల కోత పడుతుందని విమర్శలు వ్యక్తముతున్నాయి. ప్రస్తుతం యూఎస్ సెనేట్‌లో ఈ బిల్లుపై మారథాన్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 

శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యేలోపు బిల్లును ఆమోదింపజేసి అధ్యక్షుడి కార్యాలయానికి పంపాలని రిపబ్లికన్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. సెనేట్‌లో రిపబ్లికన్లకు స్వల్ప మెజార్టీ ఉన్నందున.. పార్టీపై ట్రంప్‌కు ఉన్న బలమైన పట్టు కారణంగా బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. అయితే సెనేట్‌లో గట్టెక్కినా ప్రతినిధుల సభలో దీనికి మరో గండం పొంచి ఉంది. అక్కడ కూడా రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీనే ఉన్నప్పటికీ పలువురు సభ్యులు దీనిని వ్యతిరేకిస్తామని ఇప్పటికే సంకేతాలిచ్చారు.