04-05-2025 04:31:01 PM
జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
బోథ్ (విజయక్రాంతి): పంటను అమ్ముకునేందుకు మార్కెట్ కు వచ్చే రైతుల పక్షాన అధికారులు నిలిచి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) అన్నారు. సోనాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా మార్కెట్ కు తొలి పంటను తీసుకొచ్చిన రైతును శాలువతో సన్మానించి, తూకం కాంటలకు పూజలు చేసి కొనుగోళ్లు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... అధికారులు రైతుల తరఫున నిలవాలని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. ఎలాంటి సాకు చూపకుండా, రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.