calender_icon.png 4 May, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

04-05-2025 05:12:18 PM

మిర్యాలగూడ: మిర్యాలగూడలో ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ధాన్యం సేకరణ, సన్నబియ్యం పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddy), ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.

ఈ ఏడాదిలో బడ్జెట్ రూ.23 వేల కోట్లు కేటాయించామని, ఏదో విధంగా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. ఆగిపోయిన కందమల్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తున్నామని, గత ప్రభుత్వం కేవలం కాళేశ్వరంపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నారు. దక్షిణ తెలంగాణకు చేసినా అన్యాయం స్పష్టంగా కనిపిస్తోందని, కూలిపోయే కాళేశ్వరంపై రూ.94 వేల కోట్లు ఖర్చు పెట్టారని మంత్రి వెల్లడించారు. ఎస్ఎల్బీసీ, దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. అలాగే ఉచిత సన్నబియ్యంపై రూ. 13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నమని మంత్రి ఉత్తమ్ తెలిపారు.