calender_icon.png 5 May, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్!

05-05-2025 12:55:39 AM

  1. నిషేధిత సంస్థలతో చర్చల ప్రసక్తే లేదు
  2. మావోయిస్టులు తుపాకీ వీడాల్సిందే: కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్, మే 4 (విజయక్రాంతి): ‘మావోయిస్టులతో మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవ్. నిషేధిత సంస్థతో చర్చల ప్రసక్తే లేదు... వాళ్లు తుపాకీ వీడాల్సిందే. పోలీసులకు లొంగిపోవాల్సిందే. వాళ్ల ప్రవర్తన మార్చుకోవాల్సిందే” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు.

మావోయిస్టు సమస్యను సామాజిక కోణంతో చూడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆపరేషన్ కగార్‌ను ఆపాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజ య్ ఘాటుగా స్పందించారు. ‘తుపాకు లు చేతపట్టి అమాయక ప్రజలను, గిరిజనులను కాల్చి చంపడాన్ని సామాజిక కోణంతో చూడాలనడం ఏం పద్ధతి? బాంబులు అమర్చి పోలీసులను తునాతునకలు చేసి చంపుతుంటే సామాజిక కోణంతో చూడాలా? అసలు మావోయిస్టులపై నిషేధం విధించిందే కాంగ్రెస్ పాలకులు కాదా? ఇప్పుడు సామాజిక కోణం, చర్చలంటూ సన్నాయి నొక్కులు నొక్కడమేంది? ఎంతో మంది ప్రజలను, గిరిజనులను, పోలీసులను కాల్చి చంపినప్పుడు మీకు ఈ విషయం గుర్తుకు రాలే దా?’అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో మావోయిస్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు. కరీంనగర్‌లోని కొత్తపల్లిలో ఆదివారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్ హాజరై మాట్లాడారు.

ఆపరేషన్ కగార్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నదన్నారు. నక్సల్స్ సమస్యను సామాజిక కోణంతో చూస్తున్నామని చెప్పడం ఇదెక్కడి పద్ధతని ప్రశ్నించారు. మావోయిస్టుల చేతిలో తుపాకులున్నాయని, గిరిజనులను, అమాయ కులను కాల్చి చంపుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.