calender_icon.png 5 May, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగని అక్రమ గ్రావెల్ దందా

05-05-2025 01:02:26 AM

  1. గ్రావెల్ అక్రమ తవ్వకాలకు ప్రధాన అడ్డా చర్ల..! 

మామూళ్ల మత్తులో అధికారులు

పెట్రేగిపోతున్న మాఫియా

చర్ల, మే 4 (విజయక్రాంతి):ఏజెన్సీ ప్రాం తమైన చర్లలో  అక్రమ గ్రావెల్, మట్టి తోలకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఏజెన్సీ చట్టాలను పాతరేసి మరీ అక్రమ తోలకాలు సాగిస్తున్నా అధికారులు మామూళ్ల మత్తు లో తూలుతున్నారనే ఆరోపణలు వెలబడుతున్నాయి. .  ఈనెల 3న శనివారం అక్రమ గ్రావెల్ తోలకాలు కలివేరు పంచాయతీలో జోరుగా జరుగుతున్నాయని స్థానిక తాసిల్దార్ కు కొందరు సమాచారం ఇవ్వగా తూ తూ మంత్రం గా  వచ్చి అక్కడ ఎటువంటి తవ్వకాలు లేవు,  కేవలం జెసిబి మాత్రమే ఉందినీ, తవ్వకాలు జరిగితే  చర్యలు తీసుకుంటామన్నారు.

వాస్తవంగా కళ్ళ ముందు గ్రావెల్ తోలకాల జరుగుతున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆరోపణలను ధ్రువపరుస్తోంది.కొందరూ గుత్తేదారులు ఎవరికైనా చెప్పుకోండి అన్నట్లు వ్యవహరిస్తున్నారు.అక్రమ తవ్వకాలు జరిపే జెసిబిల ను,తొలకాలు జరిపే టిప్పర్లను గత సంవత్సర కాలంగా రెవెన్యూ అధికారులు పట్టుకు న్న దాఖలాలు లేవు. చిన్న చితకా ట్రాక్టర్లను మాత్రం పట్టుకుంటూజరిమానా విధిస్తున్నారు తప్పా మాఫియా జోలికి వెళ్ళటం లేదని తెలుస్తోంది.

కలివేరు ప్రాంతం నుంచి కొండల తవ్వి  పెద్ద ఎత్తున తరలిన గ్రావెల్ మొత్తాన్ని సీజ్ చేసి జరిమానా విధించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీ చట్టాల ప్రకారం  అక్రమంగా తోలిన గ్రావెల్ మొత్తానికి విలువ కట్టి జరిమానావిధిస్తే, ఆ విలువ దాదాపు రూ లక్షలలో ఉంటుందన్నారు.

ఈ గ్రావెల్ తోలకాల భాగోతంపై గిరిజనులు మండిపడుతున్నారు.  గ్రావెల్ తోలకాల అంశంతమ  దృష్టికి రాలేదని రెవె న్యూ అధికారులు చెప్పుకొస్తున్న తీరు అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . జిల్లా ఉన్నతాధికారులు అక్రమ గ్రావెల్ త్రవ్వకాలపై దృష్టి సారించాలని మండల ప్రజలు డిమాండ్  చేస్తున్నారు.