16-05-2025 12:39:22 AM
నిజామాబాద్, మే 15 (విజయ క్రాంతి) : నిజామాబాదు రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలంలోని వెంకట్రామ్ తండాకు చెందిన అమరాబాదు బాణావత్ రాములు తలకు తీవ్ర గాయం కావడంతో అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఎన్వోసీ అందజేశారు.
చికిత్స కోసం వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో వారిని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్సకు అవసరమయ్యే సీఎం రిలీఫ్ ఫండ్ నుండి డబ్బులు ఇప్పించడానికి ఎల్‌ఓసి లేఖను ఎమ్మెల్యే భూపతిరెడ్డి వారికి అందజేశారు. తమకు సహకరించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డికి బాణావత్ రాములు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.