16-05-2025 12:39:20 AM
కరీంనగర్ క్రైం, మే 1౫ (విజయక్రాంతి): దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం ఈ నెల 17 నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు గిట్ల ముకుంద రెడ్డి పిలుపునిచ్చారు.
నగరంలోని ముకుందలాలు మిస్ రా భవన్లో ట్రేడ్ యూనియన్ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శిలు టేకుమల్ల సమ్మయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి జిందం ప్రసాద్, సీఐటీ యూ జిల్లా కోశాధికారి రాజేశం, నగర కార్యదర్శి పుల్లెల మల్లయ్య, తదితరులు పాల్గొనారు.