02-12-2025 03:34:09 PM
సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన వ్యక్తిపై దాడి!
దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆవేదన
గట్టు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచి నామినేషన్ దాఖలు చేసిన ఓ వ్యక్తిపై ఆకస్మికంగా భౌతికంగా దాడి జరిగింది.సకాలంలో ఎస్సై రాకపోతే ప్రాణాలు పోయేవని సదరు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ ఘటన గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో సోమవారం రాత్రి జరగడంతో మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఆంజనేయులు మీడియా ముందు తెలిపిన వివరాల ప్రకారం... మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా సల్కాపురం గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు చేశారు.
అయితే ఇట్టి విషయాన్ని జీర్ణించుకోలేక గ్రామంలోని కొందరు నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని నామినేషన్ ను విత్ డ్రా చేసుకోను అనడంతో జీర్ణించుకోలేక భౌతికంగా దాడికి పాల్పడ్డారని, ఆ సమయంలో ఎస్ఐ సమీపంలో ఉండడంతో బ్రతికిపోయానని లేదంటే చంపే ప్రయత్నం జరిగేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడున్న ఎస్సై మిగతావారు వచ్చి తన ప్రాణాలను కాపాడడం జరిగిందని తెలిపాడు. ఎన్నికల నియామవళి చట్ట ప్రకారం.. దాడి చేసిన వారిపైన కేసు నమోదు చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించారు.