12-10-2025 04:47:57 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఖానాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు వేయాలని కోరిన నేపథ్యంలో ఆదివారం ఆయన డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు క్యాంపు కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఖానాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, నాయకులు విజయేందర్, తదితరులు ఉన్నారు.