12-10-2025 04:50:47 PM
బాల్యస్మృతుల నెమరు..
గురువులకు సన్మానం..
బెల్లంపల్లి అర్బన్: ఆ విద్యార్థులు ఎంతో కాలానికి గానీ కలుసుకోలేదు. జీవన గమనంలో ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులకు ఆదివారం సమ్మేళనం ఆతిథ్యం ఇచ్చింది. 1988-89 బ్యాచ్ కి చెందిన బెల్లంపల్లి సీఎస్ఐ హై స్కూల్ విద్యార్థులు, విద్యా అభ్యాసం చేసిన గురువులు కలుసుకున్నారు. ఉపాధ్యాయులుగా, ఆనాటి విద్యార్థులుగా ఇరువురు తమ విభిన్నమైనా అనుభవాలు, స్మృతులు, అల్లరి చిలిపి చేష్టలను నెమరువేసుకున్నారు.
తమకు విద్యాభ్యాసం చేసి ఉన్నతమైన భవిష్యత్తుకు దారులు వేసిన గురువులను మరోసారి గుర్తు చేసుకుని ఆప్యాయంగా సన్మానించారు. తమ విద్యా బోధనలతో ఎవరి స్థాయిలో వారు జీవితంలో స్థిరపడి తమ వారంతైనా పూర్వ విద్యార్థులు మళ్లీ మాకు కనబడడం మర్చిపోలేని తీపి జ్ఞాపకాలుగా మదిలో ఉండిపోతాయని ఉపాధ్యాయులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని తీపి జ్ఞాపకాలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.