29-01-2026 12:00:00 AM
భీమదేవరపల్లి జనవరి 28 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ పాఠశాలలో విద్యార్థులకు బట్టల దుకాణం యాజమాని గోలి శ్రీనివాస్ స్వచ్ఛందంగా నూతన దుస్తులు పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లోని గంగిరెద్దుల కాలనీ, వడ్డెర కాలనీ విద్యార్థి నీ విద్యార్థులకు నూతన దుస్తులు పంపిణీ చేయడం పట్ల కొప్పూరు గ్రామ సర్పంచ్ గద్ద కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు.
గోలి శ్రీనివాస్ తన క్లాస్మేట్ మిత్రుడు అనుమాండ్ల ప్రసాద్ రెడ్డి కోరిక మేరకు పేద విద్యార్థులైన గంగిరెద్దుల కాలనీ తోపాటు వడ్డెర కాలనీ లోని 60 మంది విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మిరియాల రాణి, రాజు తక్కలపల్లి మల్లికార్జున రావు తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.