calender_icon.png 18 October, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగో రోజు 16 మంది నామినేషన్లు

17-10-2025 12:51:43 AM

జూబ్లీహిల్స్‌లో ఇప్పటి వరకు 46 మంది అభ్యర్థులు, 56 సెట్ల దాఖలు

హైదరాబాద్,సిటీ బ్యూరో అక్టోబర్ 16 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ రోజురోజుకు వేడెక్కుతోంది. గురువారం ఏకంగా 16 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేసారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్య 46కు, దాఖలైన సెట్ల సంఖ్య 56కు చేరింది. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది.

రానున్న రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ  ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయనుండటంతో, మొత్తం అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది.