17-10-2025 12:51:10 AM
-నట్టింటిలో తల్లి మృతదేహం పెట్టుకొని నగల కోసం కూతుళ్ల పంచాయితీ
-మరణించి మూడు రోజులైనా అంత్యక్రియలు చేయని వైనం
-సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఘటన
నూతనకల్ (ఆత్మకూర్ ఎస్) అక్టోబర్ 16(విజయక్రాంతి) : అమ్మకు ఆఖరి గౌరవ మే అత్యంత విలువైన ఆస్తి. అయితే ఆస్తి పం పకాల పేరిట ఓ అమ్మకు అవమానం జరిగింది. అమ్మ పంచిన ప్రేమ, ఆమె పిల్లలకు చేసిన సేవ అన్ని ఆస్తి ముందు దిగదుడుపుగా మారిపోయాయి అనడానికి మంచి ఉ దాహరణ ఈ సంఘటన. తల్లి దాచిన డబ్బు, నగల కోసం చివరకు మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఆపడం విస్మ యం కలిగిస్తోంది. మూడు రోజులుగా మృ తదేహాన్ని నట్టింటిలో పెట్టుకుని మరీ నగల లెక్కల కోసం కూతుళ్లు పట్టుబట్టడంపై చు ట్టుపక్కల వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రానికి చెందిన పొదిల నరసమ్మ ఆరోగ్య సమస్యలతో మృతి చెందింది. విషయం తెలిసి పుట్టింటికి వచ్చిన ఆమె ఇద్దరు కూతుళ్లు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం మాని, మృతదేహాన్ని ఐస్ బాక్సులో పెట్టి, తల్లి దాచిన డబ్బు, నగల కోసం వెతుకుతూ పంచాయితీ పెట్టారు. తల్లి వద్ద రూ. 12 లక్ష లు, 6 తులాల బంగారం కోసం గొడవ పడ్డారు. నరసమ్మకు చెందిన 8 ఎకరాల వ్యవసాయ భూమిని గతంలోనే కూతుళ్లు ఇద్ద రూ చెరిసగం పంచుకున్నారు.
ఇప్పుడు డబ్బు, నగల వాటా విషయం తేలే వరకూ అంత్యక్రియలు చేసేది లేదని పంతం పట్టారు. అంత్యక్రియల తర్వాత ఆస్తు ల లెక్క తేల్చుకోండని బంధువులు, ఇరుగుపొరుగు వారు నచ్చజెప్పినా వినలేదు. దీంతో విసిగిపోయిన బంధువులు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. చివరకు పోలీసులు చెప్పినా వినకుండా తల్లి నగల కోసం కూతుళ్లు పట్టుబట్టడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.