17-08-2025 10:35:09 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలోని చందుర్తి గ్రామంలో గల దీక్షిత్ ఇండియన్ గ్యాస్ గోదాం లో చోరీ జరిగింది. చందుర్తి ఎస్ఐ జె. రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఆ గోదాం యజమాని సాయంత్రం తాళం వేసి ఇంటికి వెళ్లగా, ఆదివారం ఉదయం 8 గంటలకు తిరిగి వచ్చి చూడగా, ఆఫీస్ రూమ్ గోడకు రంద్రం చేసి లోపలికి చొరబడ్డారని తెలిపారు. ఆఫీస్ లోని రికార్డులు చెల్లాచెదురుగా పడి ఉండగా, ₹7,000 నగదు గల్లంతైనట్లు యజమాని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, వేలిముద్ర నిపుణులు, క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించడమే కాకుండా, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.