17-08-2025 10:27:01 PM
పనులు నిలిపేయాలని కేఎస్ఆర్ కాలనీ వాసుల నిరసన
పటాన్ చెరు(అమీన్ పూర్): జనావాసాల మద్య సెల్ టవర్ ఏర్పాటును వెంటనే విరమించుకోవాలని కే ఎస్ ఆర్ కాలనీ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కేఎస్ఆర్ కాలనీలో సెల్ టవర్ ఏర్పాటుకు నిరసనగా కాలనీ వాసులతో కలిసి ఆదివారం భాస్కర్ నిరసన వ్యక్తం చేశారు. సెల్ టవర్ ఏర్పాటుతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తింటాయని, తరుచూ అనారోగ్యాలతో ఇబ్బదులు పడుతారని ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ టవర్ పనులు వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. సెల్ టవర్ ఏర్పాటును నిలిపేయాలని అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కాలనీ వాసులు తెలిపారు. సెల్ టవర్ ఏర్పాటు విరమించుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.