17-08-2025 10:02:56 PM
పటాన్ చెరు(జిన్నారం): నూతన లయన్స్ క్లబ్ ఆఫ్ జిన్నారం(ఆదర్శ)ను ఆదివారం ఆవిష్కరించారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో జరిగిన 20వ డిస్ట్రిక్ట్ కేబినెట్ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ జిన్నారం(ఆదర్శ) ఆవిష్కరణ జరిగింది. లోగో ఆవిష్కరణ, సర్టిఫికెట్ లను క్లబ్ నూతన చైర్మన్ ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ కరుణాసాగర్ రెడ్డి, ట్రెజరర్ ప్రభాకర్ రెడ్డిలకు అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహబంధు చైర్మన్ రాఘవేంద్రరావు, జనరల్ సెక్రటరీ నలగండ్ల అశోక్ నూతన క్లబ్ ను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారని నూతన లయన్స్ క్లబ్ జిన్నారం చైర్మన్ ఆనంద్ తెలిపారు.