calender_icon.png 18 August, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి

17-08-2025 10:07:22 PM

రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్

హుజూర్ నగర్: ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో జిల్లాలోనే అత్యంత వైభవంగా  జరిగే రెండో జాతరగా పేరుపొందిన పొంచర్ల ముత్యాలమ్మ తల్లి జాతర, బోనాల వేడుకకు ఆదివారం మంత్రి ఉత్తమ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ జాతర, నిర్వహణ కమిటీ సభ్యులు మంత్రి ఉత్తమ్ కు స్వాగతం పలికారు. ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ...హుజూర్ నగర్ ముత్యాలమ్మ తల్లి అంటేనే మహిమ గలదని ఆతల్లి దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో రైతులు సంతోషంగా ఉండాలన్నారు.అమ్మవారి ఆశీర్వాదంతో ఈ ప్రాంత రైతులను క్షేమంగా చూసుకోవాలన్నారు.దేవాలయ అభివృద్ధికి పది లక్షల రూపాయలు నిధులు కేటాయించారు.