calender_icon.png 17 August, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

17-08-2025 10:39:46 PM

నర్సంపేట/నల్లబెల్లి,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో  వ్యక్తి పడి మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ శివారు జాతీయ రహదారి మూలమలుపు వద్ద  జరిగింది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోవిందరావుపేటకు చెందిన నేతావత్ వెంకన్న (55) గోవిందరావుపేట నుండి మర్రిపెడ బంగ్లాకి వెళ్తున్న క్రమంలో నల్లబెల్లి మండలం నర్సంపేట మల్లంపల్లి జాతీయ రహదారి రుద్రగూడెం గ్రామ శివారు మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు కింద పడి మృతి  చెందాడని తెలిపారు.మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.