17-08-2025 09:57:34 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హైదరాబాద్ గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్పోర్ట్స్ అకాడమీలో శనివారం జరిగిన 24వ జాతీయ అబాకస్ పోటీలలో వరంగల్ కేంద్రీయ విద్యాలయానికి చెందిన పోనకంటి సుచిత్ ప్రతిభ కనబరిచి ప్రశంస పత్రాన్ని అందుకొని రన్నర్ గా నిలిచారు. వివిధ రాష్ట్రాల నుంచి పలు జిల్లాల విద్యార్థులు పాల్గొన్నారు. అబాకస్ టీచర్ ధనుంజయ్ విద్యార్థి సుచిత్ తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.