calender_icon.png 18 August, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తోటి స్నేహితునికి ఆపత్కాల సమయంలో ఆదుకున్న పూర్వ విద్యార్థులు

17-08-2025 10:16:51 PM

పెన్ పహాడ్:  మండలంలోని అనంతారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1997-98 లో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్ధులు  తమ మిత్రుడు, సహా విద్యార్థి అనంతారం గ్రామానికి చెందిన రామిడి రంగారెడ్డి (లేట్) కొట్టు జయమ్మ దంపతుల కుమారుడు రామిడి లక్ష్మారెడ్డికి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు.

స్థోమతకు మించి హాస్పిటల్ లో ఖర్చు కావడం విషయం తెలుసుకున్న తమ తోటి మిత్రులు, పూర్వ విద్యార్థులు కలసి ఆపత్కాల సమయంలో  రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించి బాసటగా నిలిచారు. బాధితుడు లక్ష్మారెడ్డి అర్ధిక పరిస్థితి బాగలేని కారణంగా దయగల దాతలు సహృదయంతో  సహాయం అందించి అదుకోగలని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ఎవరైనా దాతలు ఉంటే రామిడి ఝాన్సీ (భర్త లక్ష్మారెడ్డి ఫోన్ పే నెంబర్ కు) 8179255343 ఆర్ధిక సహాయం అందిస్తారని బాధితురాలు ఆశిస్తున్నారు.