calender_icon.png 3 December, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సులభంగా డబ్బు సంపాదించాలని అత్యాశతో అత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు

03-12-2025 12:23:43 AM

  1. హిందీ సినిమాల ప్రభావానికి లోనై బెదిరింపులు
  2. పోలీసుల అదుపులో అజయ్
  3. వివరాలు వెల్లడించిన ఎస్పీ నీతిక పంత్

కుమ్రంభీం అసిఫాబాద్, డిసెంబర్ 2(విజయక్రాంతి): సినిమాల ప్రభావంతో యువ కుడు నేర చరిత్ర వైపు మళ్లాడు.సులభంగా సంపాదించాలని ఆశతో మారునాయుధాలను కొనుగోలు చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.అక్రమ ఆయుధాలతో హత్యాయత్నం నిందితుడిని అరెస్ట్ చేసిన కౌటాల పోలీసులు  హత్యాయ త్నం ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి అక్రమ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు  కౌటాల పోలీస్ స్టేష న్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పి నితిక పంత్ వివరాలు వెల్లడించారు.

ఎస్పీ వివరాల ప్రకారం కౌటాల మండలానికి చెందిన ఓ ఫెర్టిలైజర్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని, గుర్తు తెలియని వ్యక్తి 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షాపు షట్టర్ వద్ద బెదిరింపు లేఖలు పెట్టాడు. అనంతరం సెప్టెంబర్ 26న కూడా ఫోన్ ద్వారా బెదిరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 15న బాధితుడి తమ్ముడిపై కాల్పులు జరపడానికి ప్రయత్నించగా  గురి తప్పడంతో పరారయ్యాడు.

కుర్బంకర్ అజయ్  కౌటిసాండ్గావ్ గ్రామానికి చెందిన ఆయన సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన నిందితుడు హిందీ సినిమాల ప్రభావంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ఎస్పి వెల్లడించారు. బెదిరింపు లేఖలకు స్పందన రాకపోవడంతో యూట్యూబ్ ద్వారా బీహార్లో ఆయుధాలు దొరుకుతాయని తెలుసుకుని అక్కడికి వెళ్లి పిస్తోల్, తపాంచ, బుల్లెట్లు కొనుగోలు చేశాడు.

అక్కడే షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు విచారణలో తేలింది.డిసెంబర్ 2న బాధితుడి కుటుంబాన్ని హత్య చేయాలనే ఉద్దేశంతో బ్పై వస్తున్న నిందితుడిని, ఎన్నికల నేపథ్యంలో ముత్తమ్పేట క్రాస్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు.

అతని వద్ద నుంచి పిస్తోల్, తపాంచ, రెండు మ్యాగజైన్లు, 15 చిన్న బుల్లెట్లు, ఒక పెద్ద బుల్లెట్, ఐదు ఖాళీ కోకలు, మొబైల్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణను కాగజనగర్ డీఎస్పీ వహీదుద్దీన్ నిర్వహించగా, కౌటాల సీఐ బి. సంతోష్ కుమార్, ఎస్‌ఐ చంద్రశేఖర్, కాగజనగర్ రూరల్ ఎస్‌ఐ సందీప్, సిబ్బంది రమేష్, సాయిరాజ్, దుర్గ ప్రసాద్, దీపక్ల కృషిని ఎస్పీ  అభినందించారు.