24 August, 2026 | 11:36 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

పీర్జాదిగూడ పెద్ద చెరువులోని 80 ఇండ్లకు నోటీసులు

01-09-2024 01:17 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా మేడిపల్లి మం డలం పీర్జాదిగూడ పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణా ల్లో 80 ఇండ్లకు తహసీల్దార్ హసీనా శనివా రం నోటీసులు జారీ చేశారు. 40 ఎకరాల్లో ఉండాల్సిన చెరువు ప్రస్తుతం 30 ఎకరాలకు కుంచించుకుపోయిందని, చెరువుకు సంబంధించి సుమారు 10 ఎకరాల వరకు పూర్తిగా ఆక్రమణలకు గురైందని కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు రెవె న్యూ అధికారులు చెరువు ఆక్రమణలో ఉన్న ఇండ్లకు నోటీసులు జారీ చేసినట్టు తహసీల్దార్ తెలిపారు. చాలా ఏండ్లుగా నివాసం ఉంటున్న తమకు తాజాగా నోటీసులు ఇవ్వడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ నోటీసులు జారీ అయిన ప్రజలను కలిసి విషయంపై ఆరా తీశారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ఈటల భరోస ఇచ్చారు.