30-08-2024 01:49:18 AM
హాజరుకానున్న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, కొండా సురేఖ
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాకు వర ప్రదాయినిగా భావిస్తున్న దేవాదుల ప్రాజెక్టుపై శుక్రవారం సమీక్ష జరగనుంది. ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్ద జరగనున్న ఈ సమీక్షకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ హాజరుకానున్నారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొనున్నారు. 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. తక్కు వ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దేవాదుల పనులను వేగవంతం చేసిం ది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పను లు ఇప్పటికే 91శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అదనంగా 89,312 ఎకరాల కొత్త ఆయక ట్టు సాగులోకి రానున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాజెక్టు పూర్తయితే వరంగల్, హనుమకొండ, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ఇప్పటికే 3వ ఫేస్ పనులు చివరి దశకు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇది లా ఉండగా ఈ ప్రాజెక్టు కోసం ప్రభు త్వం మరో రూ.2,957 ఎకరాల భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభు త్వం ఇప్పటికే రూ.14,188కోట్ల ఖర్చు పెట్టగా 30,268 ఎకరాలను సేకరించా రు. దేవాదుల పూర్తయితే మొత్తం 2.40లక్షల ఎకరాల ఆయకట్టుకు 10 పంప్‌హౌస్‌ల ద్వారా 1,750వేల క్యూ సెక్కుల నీటి విడుదల చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.