25-10-2025 06:16:44 PM
డిచ్ పల్లి (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ పరీక్షల ఫీజు 25-10-2025 వరకు చెల్లింపు తేదిని సవరిస్తూ 4-11-2025 వరకు చెల్లించాలని కంట్రోలర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2025 నవంబర్ నెలలో నిర్వహించబోయే డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్స్(బి.ఏ./బి.కాం./బి.ఎస్‌సి./బిబిఎ/బిసిఎ) కోర్సుల ఒకటవ, మూడవ, ఐదవ, సెమిస్టర్ రెగ్యులర్, రెండవ, నాలుగవ, ఆరవ, సెమిస్టర్ బ్యాక్‌లాగ్స్ 2021, 2022, 2023, 2024 బ్యాచ్‌లకు చెందిన అర్హత కలిగిన విద్యార్థుల(థియరీ) పరీక్ష ఫీజు చివరి తేదీ 25-10-2025 ఉండగా దానిని సవరిస్తూ 04-11-2025 వరకు చెల్లించాలని, 100 రూ. అపరాధ రుసుముతో 06-11-2025 వరకు చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కే.సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు కోసం తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందన్నారు.