25-10-2025 06:16:44 PM
హన్మకొండ,(విజయక్రాంతి): కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉప్పల్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఖరీఫ్ పంట కొనుగోలు కేంద్రాలను హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ప్రారంభించారు. అనంతరం తౌటం ఝాన్సీ రాణి మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని, రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రభుత్వం రైతులను రాజు చేయాలనే దృఢ సంకల్పంతో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు.