calender_icon.png 1 May, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి బరి నుంచి ఎన్టీఆర్ ఔట్!

30-04-2025 12:00:00 AM

‘దేవర’ పార్ట్ వన్ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ‘ఎన్టీఆర్-నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో కనిపించనున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించటంలో ప్రశాంత్ నీల్‌కు ఓ ప్రత్యేక శైలి ఉంది. బాక్సాఫీస్‌ను రఫ్పాడించిన ‘కేజీఎఫ్’, ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో ‘ఎన్టీఆర్-నీల్’ ప్రాజెక్టుపైనా భారీ అంచనాలేర్పడ్డాయి.

ఈ చిత్రంలో నీల్ తనదైన స్టుల్లో ఎన్టీఆర్‌ను ఇప్పటివరకు ఎవరూ వెండితెరపై చూపించని విధంగా సరికొత్త మాస్ అవతార్‌లో ఆవిష్కరించనున్నట్టు యూనిట్ పేర్కొంటోంది. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది.

తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించింది మూవీ యూనిట్. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చే తేదీని సైతం వెల్లడించారు. గతంలో ఈ చిత్రాన్ని 2026, జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ సినిమా పట్టాలెక్కగానే రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. ఈ చి త్రాన్ని 2026, జూన్ 25న విడుదల చేయనున్నట్టు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఆ రోజు గురువారం. మొహర్రం పండు గ ఉం ది. అంతేకాదు వీకెండ్ కూడా వస్తోంది. ఇలా వరుసగా 4 రోజులు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో తమ అభిమాన హీరో బొమ్మ మంచి డేట్‌కే పడుతోందంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు సంక్రాంతి బరి నుంచి తప్పుకోవటంపై ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎన్టీఆర్ పుట్టినరోజున రిలీజ్ చేస్తామని ప్రకటిం చింది టీమ్. అంటే, మే 20న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారన్న మాట! తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి భువన్‌గౌడ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అంది స్తున్నారు.