calender_icon.png 1 May, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహల్గాం ఘటన ఎంతో బాధించింది

30-04-2025 12:00:00 AM

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని చెప్పింది హీరోయిన్ నభా నటేశ్. ఉగ్రదాడులు హేయమైన చర్య అని దేశమంతా బాధితులకు సంఘీభావంగా ఉంటామని పేర్కొంది. అందమైన పహల్గాంలో తాను షూటింగ్ చేశానని, అందమైన అహ్లాదకరమైన ప్రదేశమని తెలిపింది. పహల్గాంలో షూటింగ్ చేసిన జ్ఞాపకాలను నభా పంచుకుంది.

ఈ ఘటనపై నభా నటేశ్ స్పందిస్తూ.. “పహల్గాం బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ నేను నటించిన ‘డార్లింగ్’ మూవీ షూటింగ్ చేశాం. చుట్టూ 5 కిలోమీటర్ల మేర అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. భూతల స్వర్గమైన పహల్గాంలో ఉగ్రదాడి జరపడం హేయమైన చర్య. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

ఇలాంటి దాడులు జరిగాక ఫిలిం మేకర్స్ పహల్గాం వెళ్లాలంటేనే ఆలోచిస్తారు. స్థానిక ప్రజలు చాలా మంచివారు. మా టీమ్‌కు స్నేహితులుగా మారిపోయారు. పహల్గాం దాడి ఘటన గురించి వినగానే నాకు అక్కడ షూటింగ్ చేసిన రోజులన్నీ కళ్లముందు తిరిగాయి” అని చెప్పింది.