16 August, 2026 | 1:57 AM

నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి

25-05-2024 12:05 AM

మహబూబ్‌నగర్, మే 24 (విజయక్రాంతి): వినియోగదారుల ఇండ్లకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్‌శాఖ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మావేశంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ వెంకట రమేష్, డీఈటీ చంద్రమౌళి, డీఈ శివరాం పాల్గొన్నారు.