24-07-2025 12:00:00 AM
జాషువా తన కాలపు కుల, మత వాస్తవికతనూ, అంటరానితనాన్నీ, అంధవిశ్వాసాలనూ, పేదరికాన్నీ, దోపిడీనీ, స్త్రీలపై పీడననూ శక్తిమం తమైన కవిత్వంగా మలిచాడు. ప్రకృతి మీదా, పిల్లల మీదా, ప్రేమా, కరుణ వంటి విలువల మీదా, కళల మీదా, మానవ అశాశ్వతత్వం మీదా, మరణం మీదా- ఇలా విభిన్న అంశాల మీద వైవిధ్యపూరితమైన కవిత్వం రాశాడు.
“రాజు చనిపోతే తార రాలుతుంది
కవి చనిపోతే తార నింగిని చేరుతుంది
రాజు విగ్రహమై ఆదర్శమవుతాడు
కవి ప్రజల నాలుక మీద జీవిస్తాడు”
“వడగాల్పు నా జీవితమయితే
వెన్నెల నా కవిత్వం”
అని జాషువా పేర్కొన్నారు.
ఆధునిక తెలుగు కవులలో స్థానం పొం దిన కవి గుర్రం జాషువా సెప్టెంబర్ 28, 1895న జన్మించాడు. సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుంచి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశాడు. కవిత్వాన్ని ఆ యుధంగా చేసుకుని మూఢాచారాలపై తి రగబడ్డాడు. ఛీత్కారాలు ఎదురైన చోటే స త్కారాలు పొందాడు. గుర్రం జాషువా త ల్లిదండ్రులు గుర్రం వీరయ్య, లింగమ్మ.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వినుకొం డ మండలం చాట్రగడ్డపాడులో జన్మించా డు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెం దిన వారు. తండ్రి యాదవులు, తల్లి మాది గ. జాషువా బాల్యం వినుకొండ గ్రా మంలో సాగింది. చదువుకోడానికి బడి లో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే జాషువా ఊరుకొనే వాడు కాదు, తిరగబడేవాడు.
ఆధిపత్య కు లాల పిల్లలు కులం పేరుతో జాషువాను హేళన చేస్తే, తిరగబడి వాళ్లను కొట్టాడు. 1910లో మేరీని వివాహం చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూ పాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్లి 19 15- 16లలో అక్కడ సినిమా అనువాదకుడిగా పనిచేసాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై సాగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణల ను చదువుతూ పోవడమే ఈ పని.
తరువాత గుంటూరులోని లూథరన్ చర్చి న డుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేశాడు. తరువాత 1928 నుంచి 1942 వరకు గుంటూరులోనే ఉన్నత పాఠశాల లో తెలుగు పండితుడిగా పనిచేశాడు. రెం డో ప్రపంచయుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేశాడు. 1957 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేశా డు.
ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివా డు. తక్కువ కులం వాడిని సభలోకి ఎం దుకు రానిచ్చారంటూ కొందరు ఆయన్ను అవమానించారు. అంటరానివాడని హిం దువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండి హిం దూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమా జం నుంచి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు.
జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. చిన్నత నం నుంచి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడు, త రువాతి కాలంలో రచయిత అయిన పి చ్చ య్య శాస్త్రి సహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. హనుమచ్ఛాస్త్రి వ ద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం చదివాడు.
జాషువా 39 గ్రంథా లు, మరెన్నో కవితా ఖండికలు రాశాడు. తనకాలంలో వస్తున్న కవిత్వానికి ప్రత్యా మ్నాయ కవిత్వాన్ని రాసి మెప్పించిన వా డు జాషువా. తన కవితా ప్రస్థానంలో ఎ న్ని అడ్డంకులూ, అవమానాలూ ఎదుర్కొ న్నాడో అన్ని నీరాజనాలూ అందుకున్నా డు. జాషువా కవిత్వ వస్తు విప్లవం తెలుసు కోవాలంటే ఆయన సమకాలీన కవిత్వం నుంచి ఆయన కవిత్వం ఎంత భిన్నంగా ఉందో చూడాలి.
తాను రంగంలోకి దిగే సరికి తెలుగు కవిత్వంలో మూడు ధోర ణులు ప్రధానంగా నడుస్తున్నాయి. కృష్ణ శాస్త్రి, రాయప్రోలుల నాయకత్వంలో భా వకవిత్వం ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. విశ్వ నాథ సత్యన్నారాయణ నాయకత్వంలో హిందూ సనాతన కవిత్వం మరోపక్క సవ్వడి చేస్తుంది. గబ్బిలం ఆయన రచన ల్లో ఉత్తమైంది. కాళిదాసు మేఘసందేశం తరహాలో ఆ రచన సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు..
ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు. తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయాలని గబ్బిలంతో సందే శం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితులకు ప్రవేశం లేదు. కానీ గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వే దనను వర్ణించిన తీరు హృదయాలను క లచివేస్తుంది. 1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన.
పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యా న్ని రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని అద్భుతంగా వర్ణించాడు.
బాపూజీ మరణవార్త విని..
బాపూజీ -మహాత్మాగాంధీ మరణ వార్త విని ఆవేదనతో 1948లో జాషువా సృష్టించిన స్మృత్యంజలి వర్ణనాతీతం. వీరి రచన లు.. రుక్మిణీ కల్యాణం- చిదానంద ప్రభా తం, కుశలవోపాఖ్యానం ధ్రువ విజ యం, కృష్ణనాడి, సంసార సాగరం శివాజీ ప్రబంధం, వీరాబాయి, కృష్ణదేవరాయ లు, వేమన యోగీంద్రుడు, భారతమాత, భారతవీరుడు, సూర్యోదయం, చంద్రోద యం, గిజిగాడు, రణచ్యుతి,
ఆంధ్రుడను, తుమ్మెద పెళ్ళికొడుకు, సఖి, బుద్ధుడు, తె లుగుతల్లి, శిశువు, బాష్ప సందేశం - దీర్ఘ ని శ్వాసం, ప్రబోధం, శిల్పి, హెచ్చరిక, సాలీ డు, మాతృప్రేమ, భీష్ముడు, యుగంధర మంత్రి, సమదృష్టి, నేల బాలుడు, నెమలి నెలత, లోక బాంధవుడు, అనసూయ, శ ల్య సారథ్యం, సందేహ డోల, స్వప్న కథ, అనాథ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, సింధూరం, బుద్ధ మహిమ, క్రీస్తు, గుం టూరు సీమ, వివేకానంద,
చీట్లపేక, జేబున్నీసా, పశ్చాత్తాపం.అయోమయం, అఖం డ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, శ్మశానవాటిక, ఆంధ్ర భోజుడు, గబ్బిలం, కాంది శీకుడు, తెరచాటు, చిన్న నాయకుడు, బా పూజీ, నేతాజీ, స్వయంవరం, కొత్తలోకం, క్రీస్తు చరిత్రరాష్ర్ట పూజ, ముసాఫిరులు, నాగార్జునసాగరం, నా కథ. 1971 జూలై 24న జాషువా కన్ను మూశాడు.