16-09-2025 08:00:55 PM
కుభీర్: మండల కేంద్రం కుబీర్ కు వ్యవసాయ విస్తీర్ణ అధికారి గత కొంతకాలంగా లేకపోవడంతో పంట నమోదు ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీంతో మండల కేంద్రానికి చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. సోయా కోతకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా పంట నమోదు ప్రక్రియను ప్రారంభించకపోవడం పట్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం లేకపోలేదు. మండలంలో కుబీర్ తో పాటు సోనారి,పల్సి, కసర, డోడర్న, పార్డి బీ చాత, Closing, నిఘ్వా 9 క్లస్టర్లు ఉన్నాయి.
అన్ని క్లస్టర్లకు ఏఈవోలు ఉండగా మండల కేంద్రమైన కుబీర్ కు ఏఈవో లేకపోవడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు, రైతు నాయకులు ఏవో సారికను కలిసి ఏవో ను నియమించాల్సిందిగా వినతిపత్రం అందజేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఏవో ను నియమించకపోవడం తో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పంట నమోదు ప్రక్రియ చేపట్టే విధంగా కుబీర్కు ఏఈఓ ను నియమించాలని రైతులు కోరుతున్నారు.