24-01-2026 12:00:00 AM
ముషీరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహో త్సవ్ 2025-26 క్రీడా పోటీల్లో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ గాంధీనగర్ డివిజన్ నుండి పోటీలను శుక్రవారం భోలక్ పూర్ డివిజన్లోని ఘంటసాల గ్రౌం డ్స్‌లో బీజేపీ శ్రేణులు ప్రారంభించారు. వాలీబాల్, కబడ్డి పోటీల్లో పాల్గొనేం దుకు క్రీడాకారులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. పోటీల్లో పాల్గొ నే క్రీడా జట్లను పరిచయం చేసే అతిథులుగా బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ రామ్, జాతీ య వాలీబాల్ ఆటగాడు వినోద్ కుమార్, వాలీబాల్ అసోసి యేషన్ ప్రధాన కార్యదర్శి మురళీ మోహన్, క్రీడాకారులను వారి జట్లను పరిచయం చేయగా గేమ్స్ ఇన్చార్జిగా బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్ హాజరై పోటీలను పర్యవేక్షించారు.
మహిళా వాలీబాల్ లో పోటీపడ్డ ముషీరాబాద్ టీమ్ పై టీమ్ రేలియర్స్ కెప్టెన్ భవ్య టీమ్ గెలుపొందింది. పురుషుల వాలీబాల్ పోటీలో పిఅండ్ టి గాంధీనగర్ తో స్నేహ యూత్ గాంధీనగర్ టీమ్ తలపడ్డాయి. కబడ్డీ పోటీ ల్లో దీక్ష గ్లోబల్ స్కూల్‌పై ఎస్వీఎస్ హై స్కూల్ టీమ్ విజయం సాధించింది. హనుమాన్ టీమ్ చిక్కడపల్లి టీంలు పోటీల్లో పాల్గొన్నారు.
వాలీబాల్ టీమ్‌ల రెఫ్రీలుగా ఆంజనేయులు, శ్రీనివాస్ యాదవ్, హర్ష, లోకేష్, కబడ్డీ టీమ్‌ల రెఫ్రీలుగా పి. శ్రీనివాసులు, రాఘవ రెడ్డి, కేశవ రావు సింఘడే, కె. తరుణ్, పి. సంతోష్ నాయక్ పాల్గొనగా బీజేపీ నాయకులు వీఎస్టి రాజు, దామోదర్, పాల శ్రీనివాస్, సాయి కుమార్, నీరజ్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, రాహుల్, శశికాంత్‌తో పాటు క్రీడా అభిమానులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.