calender_icon.png 21 November, 2025 | 2:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో క్షుద్రపూజల కలకలం

21-11-2025 02:57:12 PM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీ(Bellampally Municipality) పరిధిలోని తొమ్మిదవ వార్డు ఉమేష్ చంద్ర రోడ్డులో క్షుద్ర పూజల ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఉమేష్ చంద్ర దారిలో ఒక దుకాణం ముందు అమావాస్య రోజు గురువారం రాత్రి బొమ్మ కోడిగుడ్లు పెట్టి పూజలు చేసిన ఘటన ప్రజలను తీవ్ర భయాందోళకు గురిచేసింది.   శుక్రవారం దుకాణం తెరిచిన  యజమానికి   షాపు ముందు క్షుద్ర పూజలు చేసినట్టు కోడిగుడ్డు,ముగ్గులు పెట్టీ ఉన్నాయి. దుకాణం ముందు పూజల  దృశ్యం చూసిన దుకాణం  యజమాని ఒక్కసారిగా  హడలెత్తిపోయాడు. పూజల  వ్యవహారంతో అటు దుకాణం యజమాని, ఇటు బస్తీ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉమేష్ చంద్ర రోడ్డునా ప్రయాణించే  ప్రజలను క్షుద్ర  పూజలు వణికిస్తున్నాయి.  క్షుద్ర పూజల  భయంతో సదరు యాజమాని దుకాణం  బందు పెట్టిన పరిస్థితి నెలకొంది. క్షుద్ర పూజలు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.