17-07-2025 05:11:42 PM
రిజిస్ట్రేషన్ చేసుకున్నా ట్రాక్టర్ ద్వారా ఇసుక తొలకాలు జరపాలి
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
ములుగు,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపట్టే లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపట్టే లబ్దిదారులు ఉచిత ఇసుక కోసం సంబంధిత పంచాయితి సెక్రటరీల ద్వారా ఎంపిడిఓ కార్యాలయంలో బుక్ చేసుకోవాలని, ఒక ఇంటి నిర్మాణం కోసం 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఉచితంగా పొందవచ్చని కలెక్టర్ వెల్లడించారు. ఇసుక తోలకాలకు సంబంధించి కొంత మంది ట్రాక్టర్ల యజమానులు రిజిస్ట్రేషన్ ను చేసుకున్నారని, వాళ్ల ద్వారా లేదా స్వంత ట్రాక్టర్ ద్వారా ఇసుక తొలకాలు జరపాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వ్యక్తుల ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తే వాహనాన్ని సీజ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.