calender_icon.png 8 November, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్‌లో ఇష్టానుసారంగా ఓడీలు

08-11-2025 12:00:00 AM

జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): ఇంటర్ విద్యలో ఉద్యోగుల కు ఇష్టానుసారంగా ఓడిలను ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఇస్తున్నారని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డా.పీ.మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంతగా ఓడీ సౌకర్యానికి కమిషనర్ తెర తీశారని, ఉద్దేశ పూర్వకంగా ఇస్తున్నారా లేదో తెలియాల్సి ఉందన్నారు.

గతంలో క్యాన్సర్, గుండెపోటు లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలున్నవారికి ఓడీలు ఇచ్చేవారని, ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైందని, నూతనంగా నియామకమైనన లెక్చరర్లతో సహా చాలామందికి ఓడి ఇవ్వడం వల్ల అనేక కాలేజీల్లో సిబ్బంది కొరత వెంటాడుతోందని తెలిపారు. ఇలాంటి వివాదాస్పదమైన నిర్ణయాలు కమిషనర్ ఎందుకు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.