08-11-2025 12:00:00 AM
శ్రీనగర్ స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో నిర్వహణ
హైదరాబాద్, నవంబర్ 7(విజయక్రాంతి) : స్థానిక శ్రీనగర్ కాలనీ స్టెమ్‌స్సార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో స్వాతంత్య్ర సమరంలో ఒక మంత్రంగా భారత జాతిని చైతన్యవంతంగా చేసిన వందేమాతర గేయం నేటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వందేమాతర గేయ ఆలాపన చేసి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు పాల్గొని మాట్లాడారు.
వందేమాతర గేయం బ్రిటీష్ సామ్రాజ్యవాదుల నిరంకుశ పరిపాలన నుంచి భరతమాతకు స్వేచ్ఛను కల్పించు టకు భారతజాతి సమైక్యత కోసం ఒక మం త్రంగా పనిచేసిందన్నారు. వందేమాతర గేయ మరియు స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలను విద్యార్థులు స్పూర్తిగా తీసుకుని క్రమశిక్షణ ఉన్నత విలువలతో కూడిన విద్యలను అభ్యసించి దేశాభివృద్ధికి పాటుపడా లని దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పాలని విద్యార్థులకు తెలియజేయాలన్నారు.
సామాజిక బాధ్యతతో విద్యార్ధుల అభివృద్ధే దేశాభివృద్ధిగా స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ చక్కటి ప్రణాళికతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పీవీఆర్ మురళీమోహన్, ఉపాధ్యా యులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.