12-05-2025 02:09:45 AM
గద్వాల, మే 11 ( విజయక్రాంతి ) : ఆంధ్రప్రదేశ్ రాష్టం కర్నూల్ జిల్లాకు చెందిన శివ చరణ బ్రహ్మచారి సస్య గ్రూప్ శ్రీనివాస్ దంపతులు, కృష్ణమోహన్ దంపతులు ఆదివారం శ్రీ జోగులాంబ అమ్మవారికి 118 గ్రా ములు, ధర రూ. (11) పదకొండు లక్షల విలువగల బంగారు కాసుల పేరు, మరియు ప్రసాద స్కీమ్ నందలి అన్నదాన సత్రము నందు భక్తులు కూర్చొని అన్న ప్రసాదము స్వీకరించేందుకు వీలుగా రూ. 50 వేలు విలువ చేసే 25 స్టీల్ టేబుల్లు విరాళంగా సమర్పించారు. అంతకు ముందు ఆలయ కార్యనిర్వహణాధికారి పురేందర్ కుమార్ వారికీ ప్రత్యేక పూజలను చేయించారు.