12 March, 2026 | 3:42 AM

కార్యాలయ పనులను త్వరగా పూర్తి చేయాలి

12-03-2026 12:14 AM

ఆలేరు, మార్చి 11: మోటకొండూరు మండల కేంద్రంలో నూతనంగా చేపడుతున్న మండల తాసిల్దార్ కార్యాలయ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించి.

పనుల పురోగతి పై అధికారులతో మాట్లాడారు. నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టి, మండలంలోని ప్రజలకు రెవెన్యూ సంబంధిత సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ రాజేంద్ర ప్రసాద్, యం.పి.డి.ఓ ఇందిర, అధికారులు పాల్గొన్నారు.