రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల, మార్చి 11 : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ప్రతి రోజు సమయానికి ఆసుపత్రికి హాజరవుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అం దించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలిస్తూ రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలు, మందులు, ల్యాబ్ రిపోర్టులు, సర్జరీలు వంటివి వివరంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వైద్య సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులతో పాటు నర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది వంద శాతం హాజరు ఉండాలన్నారు. ల్యాబ్, రేడియాలజీ మరి యు డయాగ్నోస్టిక్ సెంటర్స్ను పరిశీలించి, ల్యాబ్ రిపోర్టులు, ఎమర్జెన్సీ టెస్టులు త్వరగా పూర్తి చేసి రోగులకు అందజేయాలని అన్నారు.
ఈ సందర్భంగా పలువురు రోగులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కు విన్నవించుకోగా, కలెక్టర్ వెంటనే స్పందించి రోగులకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్‌ఎంఓ హేమలత, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.




