calender_icon.png 6 September, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ నిమజ్జోత్స స్థలాన్ని పరిశీలించిన అధికారులు

03-09-2025 04:12:10 PM

వలిగొండ (విజయక్రాంతి): వినాయక చవితి సందర్భంగా భక్తులు ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసే అక్క చెల్లెల చెరువు స్థలాన్ని బుధవారం స్థానిక అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జనోత్సవం ప్రాంతంలో డోజర్ తో చదును చేసి భారీకేడ్లను, ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిమజ్జోత్సవాన్ని భక్తులు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జలంధర్ రెడ్డి, ఎస్ఐ యుగేందర్ గౌడ్, కార్యదర్శి నాగరాజు, బిల్ కలెక్టర్ బాబు పాల్గొన్నారు.