03-09-2025 04:08:51 PM
వెస్ట్ జోన్ డీసీపీ రాజ మహేంద్ర నాయక్..
జనగామ (విజయక్రాంతి): వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వెస్ట్ జోన్ డీసీపీ రాజ మహేంద్ర నాయక్(DCP Raja Mahendra Naik) భక్తులకు సూచించారు. బుధవారం పట్టణంలోని జ్యోతి నగర్ కాలనీలో జై హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో డీసీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత భక్తి మార్గంలో నడిస్తే మెరుగైన సమాజ నిర్మాణం జరుగుతుందని అన్నారు. వేడుకల్లో భాగంగా మండపం వద్ద ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని డీసీపీ ప్రారంభించారు. అనంతరం అసోషియేషన్ ప్రెసిడెంట్ బాల్దే దేవేందర్ డీసీపీని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు తాడూరి వెంకట్ రెడ్డ్, మహేశ్వరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.