calender_icon.png 5 September, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 7న శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మూసివేత

03-09-2025 04:16:02 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామం పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం(Sri Matsyagiri Lakshmi Narasimha Swamy Devasthanam) ఈ నెల 7న ఆదివారం ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణంతో మూసివేనున్నట్లు ఆలయ చైర్మన్ కుమార్ రెడ్డి నరేష్ రెడ్డి, ఈవో సెల్వాద్రి మోహన్ బాబు తెలిపారు. 7న ఆదివారం రోజు ఆలయం మద్యాహ్నం 12 గంటల లోపు స్వామి వారి నిత్య పూజాదికాలు, నివేదన ముగించి ద్వార బంధనం చేయబడుతుందని దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. ఆలయం తిరిగి ఈనెల 8న సోమవారం రోజు ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ నిర్వహించి ఆలయం తెరవబడడం జరుగుతుందని భక్తులు గమనించాలని కోరారు.