ప్రజావాణీకి వచ్చిన సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలి
09-12-2024 10:01 PM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్...
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజావాణీ సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టరెట్ కార్యాలయంలో ప్రజావాణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను అధికారులు వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.






