calender_icon.png 31 October, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి పట్టివేత

26-09-2024 01:26:49 AM

 హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పోలీసులు ఎన్ని తనిఖీలు చేసినా నగరంలో గంజాయి విక్రయాలకు అడ్డుకుట్ట పడటం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో గంజాయి పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం ఒడిశా రాష్ట్రానికి చెందిన కిషోర్‌దాస్ నగనరంలోని రామచంద్రాపురంలో గంజాయి అమ్మకాలు జరుపుతుండగా ఎస్‌టీఎఫ్ పోలీసులు పట్టుకు న్నారు.

నిందితుడి వద్ద నుంచి 6.17 కిలోల గంజాయితో పాటు రూ.7,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో కూకట్ పల్లి సర్కిల్‌లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు బుధవారం ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ టీం తనిఖీలు నిర్వహించి ధూల్‌పేట్‌కు చెందిన గణేశ్‌సింగ్‌ను అదుపు లోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి 1.08 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌టీఎఫ్ డీఎస్పీ తిరుపతి యాదవ్ తెలిపారు. గణేశ్ సింగ్‌తో పాటు గంజాయి విక్రయాలు చేస్తున్న ఉమేశ్‌సింగ్ ప్రస్తు తం పరారీలో ఉన్నాడని.. అతడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.