calender_icon.png 27 December, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దాలే కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సతీష్

27-12-2025 08:36:34 PM

మునిపల్లి,(విజయక్రాంతి): నూతంగా ఎన్నుకోబడ్డ మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్ లు మీ... మీ.. గ్రామాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారంతో పల్లెలను ఆదర్శంగా అభివృద్ధి తీర్చిదిద్దాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సతీష్ అన్నారు. శనివారం రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు మునిపల్లి మండలంలోనీ కంకోల్ గ్రామ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్, వార్డ్ మెంబర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ... గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి దామోదర రాజానర్సిహా సహకారంతో పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించేల ముందుకు సాగాలన్నారు. గ్రామల్లో ప్రతి ఒక్కరు కలిసి మెలిసి పని చేసినప్పుడే గ్రామాలు అభివృద్ధిలో ముందుకు సాగుతాయాన్నారు.