28 June, 2026 | 11:00 PM

ఆయిల్ సాగుతో రైతులకు ఎంతో మేలు

11-05-2026 08:44 PM

ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండలంలోని పైడిపల్లి గ్రామములో జైన అభినవ్, గంగుల నగేష్ మొదటి ఆయిల్ పామ్ గెల  కోత కోయటం జరిగిందని ఉద్యాన వన విస్తరణ అధికారి వేముల వంశీ కృష్ణ తెలిపారు. 2022-23 సంవత్సరంలో నాటిన వివిధ ఆయిల్ పామ్ తోటలను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పైడిపల్లి 2.20 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న జైన అభినవ్, గంగుల నగేష్  తోటలను  చూడటం జరిగిదoనీ,  మళ్ళీ ఇరువై రోజులకి  గెలలు కోతకి సిద్ధంగా ఉంటాయని ఇలా నిరంతరం ఆదాయం పొందాలని, రైతు నూతన పంటలకి రైతులు సాగుకి ముందుకి రావాలని ప్రభుత్వం సబ్సిడీలు పొందాలని సూచించారు.వివిధ దశలలో ఉన్న ఆయిల్ పామ్ గెలలను పరిశీలించి వాటికి తగు ఎరువుల యాజమాన్యం పద్దతులను వివరించారు. ఒక్కో ఆయిల్ పామ్ చెట్టుకు దాదాపు10 నుండి 12 గెలలు వేయడం  గమనించటం జరిగిందన్నారు.