28-11-2025 12:25:25 AM
-ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనం
-మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
హన్వాడ, నవంబర్ 27: ఆయిల్ ట్యాంకర్, స్టీల్ కంటెయినర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆయిల్ ట్యాంకర్ పేలి, ఆ వాహ న డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఎన్‌హెచ్ 167 ప్రధాన రోడ్డుపై, పల్లెమునికాలనీ వద్ద జరిగింది.
వాహనాలు ఎదురుగా ఢీ కొనడంతో ఆయిల్ ట్యాంక్ పేలి భారీగా మంటలు వ్యాపించాయి. గమనించిన పల్లెమోని కాలనీ యువకుడు శ్రీశైలం డయల్ 100కు సమాచారం అందిం చాడు. అప్పటికే ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ ఆ మంటల్లో సజీవ దహనమయ్యాడు. కంటెయి నర్ డ్రైవర్‌ను శ్రీశైలం కాపాడాడు. కేసు దర్యా ప్తు చేస్తున్నామని హన్వాడ ఎస్సై తెలిపారు.