9 May, 2026 | 9:35 AM

బాబోయ్ కుక్కలు!

16-05-2024 12:05 AM

తాండూరు మండలం కరన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కుక్క ఇంట్లోకి చొరబడి అయిదు నెలల చిన్నారిని కరిచి ప్రాణం తీసిన సంఘటన ప్రతి ఒక్కరి హృదయాన్నీ కలచి వేస్తున్నది. కుక్కల దాడుల సంఘటనలు ఇదే మొదటిసారి కాదు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. ‘కమ్యూనిటీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్’ సర్వే ప్రకారం భారతదేశ వ్యాప్తంగా 83 శాతం మంది ప్రజలకు నిత్యం వీధి, పెంపుడు శునకాల దాడి ముప్పు పొంచి ఉండటం నిజంగా అత్యంత ఆందోళనకరమైన విషయం. ప్రపంచవ్యాప్తంగానూ రేబిస్ మరణాల్లో 36 శాతం మన దేశం నుంచే ఉంటున్నాయి. దేశ వ్యాప్తంగా 2019 నవంబర్ నుంచి 2022 వరకు దాదాపు 1.60 కోట్ల వీధికుక్క కాటు కేసులు నమోదయ్యాయి. అంటే, పరిస్థితి ఎంత జటిలంగా మారిందో ఊహించవచ్చు. 

 - కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా